Tomato Price: వామ్మో! సెంచరీ కొట్టిన టమాటా

17 May, 2022 05:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టమాటా ఎరుపెక్కుతోంది. సరఫరా తగ్గడంతో పలు రాష్ట్రాల్లో టమాటా ధరలు కొండెక్కుతున్నాయి. కేరళలో రూ.100 మార్కును చేరింది. ఒడిశాలో రూ.90, కర్నాటకలో రూ.70, ఏపీ, తెలంగాణల్లోనూ రూ.60కి పైగా పెరిగినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక చెప్తోంది. తీవ్ర ఎండలకు వేడిగాలులు తోడవడంతో టమాటా ఉత్పత్తి బాగా పడిపోయింది. టమాటా ఉత్పత్తిలో ముందున్న ఏపీ, ఒడిశాల్లో అసని తుఫాన్‌తో పంట బాగా దెబ్బ తింది. ఏపీలో విశాఖ, కర్నూలు, తిరుపతిల్లో కిలో రూ.50–70 పలుకుతున్నట్టు వినియోగదారుల శాఖ నిత్యావసర సరుకుల ధరల డేటా పేర్కొంది. 

మరిన్ని వార్తలు