Sakshi News home page

ఆ అడుగుల్లో భాగమేనా? వెనక్కి తగ్గిన పల్లవి పటేల్‌ పార్టీ

Published Sun, Mar 24 2024 3:21 PM

Apna Dal K withdraws 3 lok sabha candidates uttar pradesh - Sakshi

వచ్చే ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన అప్నా దళ్ (కెమెరవాడి) తన నిర్ణయాన్ని మార్చుకుంది. పార్టీ అభ్యర్థుల సవరించిన జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి రామ్ సనేహి పటేల్ ఒక ప్రకటనలో ప్రకటించారు. 

‘ఇండియా’ కూటమికి చెందిన అప్నా దళ్ (కామెరవాడి) కౌశంబి, ఫుల్‌పూర్, మీర్జాపూర్ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అయితే తరువాత పార్టీ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ స్థానాల నుండి తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.

ఆ పార్టీ గతంలో 2022 ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఇంతకుముందు వారి సహకారం ఉన్నప్పటికీ, 2024 ఎన్నికలకు అప్నా దళ్ (కెమెరవాడి)తో పొత్తు ఉండదని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. దీంతో అప్నా దళ్ (కెమెరవాడి) త్వరలో అభ్యర్థుల కొత్త జాబితాను విడుదల చేస్తుందని భావిస్తున్నారు.

కాగా రెండు రోజుల క్రితం ఆ పార్టీ ముఖ్య నాయకురాలు పల్లవి పటేల్.. తమ పార్టీ ‘ఇండియా’ కూటమిలో ఉండాలా వద్దా అనేది కాంగ్రెస్ నిర్ణయించుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేలో చేరే అవకాశంపై సంకేతాలు ఇచ్చారు. బీజేపీ నుంచి ఏదైనా ఆఫర్ వస్తే తమ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని పల్లవి పటేల్‌ చెప్పారు. పార్టీ ప్రకటించిన స్థానాల విషయంలో నిర్ణయాన్ని మార్చుకోవడం ఇందులో భాగమేనా అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement