Sakshi News home page

మేమంతా సిద్ధం@డే4: సీఎం జగన్‌ బస్సు యాత్ర అప్‌డేట్స్‌

Published Sat, Mar 30 2024 8:29 AM

Memantha Siddham Day 4 Highlights: Cm Jagan Bus Yatra Updates - Sakshi

CM YS Jagan Memantha Siddam Bus Yatra 2024 Updates

బెంగళూరు జాతీయ రహదారిపై దారి పొడవునా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  బస్సు యాత్రకు ఆత్మీయ స్వాగతం పలికిన జనం

  • పామిడి వద్ద జాతీయ రహదారిపై జనాలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన ముఖ్యమంత్రి జగన్‌ బస్సుయాత్ర

తుగ్గలి నుండి గుత్తి వరకు దారిపొడుగునా స్వాగతం పలికిన ప్రజలు

గుత్తి గాంధీ సర్కిల్‌లో జనసునామీ

  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బస్సుయాత్రకు వెల్లువలా తరలి వచ్చిన ప్రజలు

అన్నీ మారుతున్నాయి.. సీఎం జగన్‌ ట్వీట్‌

  • మన గ్రామంలో వ్యవసాయం మారింది, వైద్యం మారింది, స్కూళ్లు మారాయి
  • గతానికి భిన్నంగా అన్నీ మారుతున్నాయి
  • పేదోళ్ల బతుకులు మారాలంటే జరుగుతున్న ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం.
  • ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతున్న ఈ మార్పుని కొనసాగించడం కోసం వేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి
     

అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన బస్సు యాత్ర

  • అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
  • కర్నూలు జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా అనంతపురం జిల్లాలోకి బస్సు యాత్ర
  • సీఎం జగన్. గుంతకల్లు నియోజకవర్గం బసినేపల్లిలో సీఎం జగన్‌కు ఘనస్వాగతం
  • సీఎంకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

కొనసాగుతున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర

  • కాసేపట్లో అనంతపురంలోకి ప్రవేశించినున్న మేమంతా సిద్ధం యాత్ర
  • గుత్తి శివారులో భోజన విరామం
  • విరామం అనంతరం కొనసాగనున్న ఎన్నికల ప్రచార యాత్ర
  • దారి పొడవునా ఆత్మీయ స్వాగతం కోసం పలు గ్రామాల ప్రజల ఏర్పాట్లు
  • సాయంత్రం ధర్మవరం నియోజకవర్గ పరిధిలో ముగియనున్న యాత్ర

జగనన్న మీ బిడ్డ.. ఆప్యాయత ఇలాగే ఉంటుంది మరి!

తుగ్గలిలో ముగిసిన సీఎం జగన్‌ ముఖాముఖి కార్యక్రమం

  • తుగ్గలి పరిధిలో జరిగిన అభివృద్ధిన వివరించిన సీఎం జగన్‌
  • ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించిన సీఎం జగన్‌
  • తమకు చేకూరిన లబ్ధి గురించి చెప్పి సంతోషించిన గ్రామస్తులు
  • సీఎం జగన్‌కు పలు వినతులు చేసిన ప్రజలు
  • ముఖాముఖి ముగియడంతో మళ్లీ మొదలైన మేమంతా సిద్ధం యాత్ర

తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్‌ ముఖాముఖి..

తుగ్గలిలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 

  • దేశంలో రూ.3వేలు పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఆరోగ్యశ్రీని రూ.25లక్షలకు పెంచాం. 
  • గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడాను గమనించండి. 
  • మన ప్రభుత్వం ఎన్నో మార్పులు జరిగాయి. సంక్షేమం మీ ఇంటి వద్దకే వచ్చింది.
  • మీ బిడ్డ పాలనలో నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బు చేరింది.
  • ఎక్కడా కూడా లంచాలు, వివక్ష లేకుండా సాయం అందించం జరిగింది. ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే సాయం అందించాం. 
  • తుగ్గలిలో 1748 ఇళ్లు ఉన్న సచివాలయ పరిధిలో అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం.
  • 58 నెలల కాలంలో గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. 
  • తుగ్గలి, రతన పరిధిలో 10వేల మంది జనాభా. 
  • తుగ్గలి, రాతన పరిధిలో 95 శాతం ఇళ్లకు బటన్‌ నొక్కి నిదులు జమ చేశాం.
  • 1748లో 1666 ఇళ్లకు 29 కోట్ల 65లక్షల రూపాయలు అందజేశాం. రాతనలో 26కోట్లు. 
  • గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారు.
  • మీ బిడ్డ పాలనలో ప్రతీ ఇంటి తలుపు తగ్టి సంక్షేమం అందించాం.
  • రైతన్నకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం.
  • విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటున్నాం. ఆర్బీకేలను ఏర్పాటు చేశాం.
  • కార్పొరేటుకు ధీటుగా స్కూల్స్‌ను తీర్చిదిద్దాం. వైద్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. 

అమ్మఒడి పథకం కింద..
తుగ్గలి.. రెండు కోట్ల 91 లక్షలు
రాతన.. రెండు కోట్ల 57 లక్షలు

వైఎస్సార్‌ చేయూత..
తుగ్గలి.. రెండు కోట్ల 30 లక్షలు
రాతన.. రెండు కోట్ల 19 లక్షలు

జగనన్న విద్యాదీవెన.. రెండున్నర కోట్లు
తుగ్గలికి.. కోటీ 16 లక్షలు
రాతన.. కోటీ 26 లక్షలు

జగనన్న వసతి దీవెన..
తుగ్గలికి.. 51 లక్షలు
రాతన.. 54 లక్షలు

వైఎస్సార్‌ ఆసరా.. 2 కోట్ల 60 లక్షలు
తుగ్గలి.. కోటి 95లక్షలు
రాతన.. 65 లక్షలు

సున్నా వడ్డీ..
తుగ్గలి..15 లక్షలు
రాతన.. 60 లక్షలు

ఇళ్లకు సంబంధించి..
తుగ్గలికి.. 66 
రాతన.. 122

పెన్షన్లు..
తుగ్గలి.. ఏడు కోట్ల 58 లక్షలు.
రాతన.. ఏడు కోట్ల 54 లక్షలు.

రైతు భరోసా..
తుగ్గలి.. ఆరు కోట్ల 15 లక్షలు
రాతన.. ఐదు కోట్ల 49 లక్షలు
 

  • తుగ్గలి చేరుకున్న సీఎం జగన్‌
  • ప్రారంభమైన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం 

జగనన్న.. మేమంతా సిద్ధం: తుగ్గలి ప్రజలు

  • మేమంతా సిద్ధం అంటూ నినాదాలు చేస్తున్నారు కర్నూలు జిల్లా తుగ్గలి వాసులు
  • అభివృద్ధి - సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలన అందించారని.. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమంటున్నారు 
  • టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనైతికం అని.. 2014 లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు నాయుడు చెప్పాలని నిలదీస్తున్నారు


తుగ్గలి సీఎం జగన్‌ ముఖాముఖి వేదిక వద్ద.. సంబురంగా నృ‍త్యాలు చేస్తున్న మహిళా లబ్ధిదారులు

వైఎస్సార్‌సీపీ నేతలతో సుదీర్ఘంగా సీఎం జగన్‌ చర్చలు

  • పత్తికొండ స్టే పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు 
  • పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, కళ్యాణదుర్గం సహా కర్నూలు జిల్లా నేతలు
  • సుమారు 1 గంటా 30 నిమిషాలకు పైగా నేతలు, కార్యకర్తలతో గడిపిన సీఎం జగన్‌
  • పలువురు పార్టీ నేతలను, సీనియర్‌ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ... యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్‌
  • పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసిన సీఎం జగన్‌

కొనసాగుతున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర

  • ప్రచార రథం దిగి మార్గమధ్యలో ప్రజల్ని కలుస్తున్న సీఎం జగన్‌
  • రతనలో ప్రజలతో మమేకమవుతున్న సీఎం జగన్‌
  • కాసేపట్లో తుగ్గలి చేరుకోనున్న సీఎం జగన్‌
  • తుగ్గలి ప్రజలతో సీఎం జగన్‌ ముఖాముఖి

రతనలో.. 

  • కర్నూలు జిల్లా రతనకు చేరుకున్న సీఎం జగన్
  • ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు
  • తుగ్గలి మండలం రాతన గ్రామంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురుచూస్తున్న గ్రామ ప్రజలు,
  • జగనన్నకు స్వాగతం పలికేందుకు గజమాల, రోడ్లపై బంతిపూల బాట వేసిన గ్రామ ప్రజలు

పత్తికొండ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర

  • కాసేపట్లో తుగ్గలి చేరుకోనున్న సీఎం జగన్‌
  • తుగ్గలి ప్రజలతో సీఎం జగన్‌ ముఖాముఖి

నేడు అనంతలోకి సీఎం జగన్‌ బస్సు యాత్ర

  • అనంతపురంలోకి నేడు ప్రవేశించనున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర
  • అనంతపురం జిల్లా సిద్ధమా? అంటూ ట్వీట్‌ చేసిన సీఎం జగన్‌

తుగ్గలి సీఎం జగన్‌ ముఖాముఖి వేదిక వద్ద.. సంబురంగా నృ‍త్యాలు చేస్తున్న మహిళా లబ్ధిదారులు

మేమంతా సిద్ధంలోనూ చేరికలు

  • ఎన్నికల వేళ అధికార పార్టీలో చేరుతున్న ప్రతిపక్ష నేతలు
  • సీఎం జగన్‌ బస్సు యాత్రలో కొనసాగుతున్న చేరికల పర్వం
  • తాజాగా పత్తికొండలో సీఎం జగన్‌ సమక్షంలో YSRCPలో చేరిన కళ్యాణదుర్గం టీడీపీ ఇన్చార్జ్ ఉమామహేశ్వర నాయుడు

నాలుగో రోజు సీఎం జగన్‌ బస్సు యాత్ర

  • నేడు అనంతపురంలోకి ప్రవేశించనున్న బస్సు యాత్ర
  • కాసేపట్లో పత్తికొండ నుంచి ప్రారంభం
  • పత్తికొండ బస శిబిరం వద్దకు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు
  • పత్తికొండ నుంచి తుగ్గలి చేరుకోనున్న సీఎం జగన్‌
  • తుగ్గలి ప్రజలతో సీఎం జగన్‌ ముఖాముఖి
  • సీఎం జగన్‌ ప్రచార రథానికి అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న జనం

కాసేపట్లో పత్తికొండ నుంచి ప్రారంభం కానున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర

  • బైపాస్‌లో బస చేసిన ప్రాంతం నుంచి మొదలుకానున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర 
  • రతన మీదుగా తుగ్గలి, గజరాంపల్లి, జొన్నగిరి, గుత్తి, పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్‌, రాప్తాడు, ఆకుతోటపల్లి, కృష్ణంరెడ్డిపల్లి వద్ద ముగింపు
  • మధ్యలో తుగ్గలిలో సీఎం జగన్‌ పబ్లిక్‌ ఇంటెరాక్షన్‌
  • రాత్రి ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని సంజీవపురంలో బస 


    ఇదీ చదవండి: మోసగాళ్ల తోక కత్తిరించే స్టార్‌క్యాంపెయినర్లు మీరే


తుగ్గలిలో ప్రజలు, మేధావులతో సీఎం జగన్‌ ముఖాముఖి

  • మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా తుగ్గలిలో పబ్లిక్‌ ఇంటెరాక్షన్‌
  • ప్రజలు, మేధావులతో ముఖాముఖి కానున్న సీఎం జగన్‌
  • వైఎస్సార్‌సీపీ గత 58 నెలలో పాలనలో తుగ్గలికి చేకూరిన లబ్ధిని సీఎం జగన్‌ వివరించే ఛాన్స్‌
  • మంచి కొనసాగాలంటే మళ్లీ ఫ్యాన్‌ గుర్తుకే ఓటేయాలని తుగ్గలి ప్రజలను కోరనున్న సీఎం జగన్‌
  • ముఖాముఖిలో పలువురు లబ్ధిదారులకు మాట్లాడే అవకాశం   

నేడు అనంతలోకి ప్రవేశించనున్న మేమంతా సిద్ధం

  • ఇవాళ(మార్చి 30) నాలుగో రోజుకి చేరుకున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర
  • కర్నూలు, అనంతపురం జిల్లాలో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం
  • పత్తికొండ నుంచి బయలుదేరనున్న ప్రచార రథం
  • రతన  మీదుగా తుగ్గలి చేరిక
  • జొన్నగిరి,  గుత్తి మీదుగా  ప్రయాణించి గుత్తి శివారులో భోజనవిరామం తీసుకుంటారు. 
  • పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్ , ఆకుతోటపల్లి , సంజీవపురం శివారు వరకు యాత్ర 
  • సంజీవపురం శివారులో సీఎం జగన్‌ రాత్రి బస
  • మొత్తం 102 కిలోమీటర్ల దూరం కొనసాగనున్న యాత్ర
     

మోసగాళ్లను నమ్మొద్దు: ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్‌

  • వారి తోకలు కత్తిరించేలా మీరే స్టార్‌ క్యాంపెయినర్లు కావాలి
  • ఎమ్మిగనూరు సభలో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పిలుపు
  • మీ బిడ్డ మంచి చేసి ఉంటే ఆ మంచిని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి
  • ఆడబిడ్డల కష్టాలు కళ్లారా చూశా.. అందుకే విప్లవాత్మక పథకాలు
  • దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 50% నామినేటెడ్‌ పదవులు
  • పిల్లల బంగారు భవిష్యత్‌ కోసం విద్యారంగంలో సంస్కరణలు
  • అన్ని వర్గాల వారికి మంచి చేసిన ప్రభుత్వానికి రాఖీ కట్టండి
  • మళ్లీ ఆ ముగ్గురు మోసాలు చేసేందుకు కూటమిగా వస్తున్నారు 
  • వ్యవసాయం దండగన్న బాబు ఓవైపు.. భూమి పుత్రుడైన మీ బిడ్డ మరోవైపు
  • పేదల తల రాతలు మార్చే ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి

కర్నూలు మేమంతా సిద్ధం సక్సెస్‌

  • మూడో రోజు కర్నూలు పార్లమెంట్‌ స్థానం పరిధిలో సాగిన మేమంతా సిద్ధం యాత్ర
  • దారిపొడువునా సీఎం జగన్‌కు సాదర స్వాగతం పలికిన పలు గ్రామాల ప్రజలు
  • ఎమ్మిగనూరు బహిరంగ సభకు పోటెత్తిన జనం
  • కర్నూలు సిద్ధం యాత్ర సూపర్‌ సక్సెస్‌ అంటూ వైఎస్సార్‌సీపీ పోస్టు

Advertisement

What’s your opinion

Advertisement