Sakshi News home page

చే‘నేత’ కళ అద్భుతం

Published Sun, Mar 26 2023 1:38 AM

- - Sakshi

● హైకోర్టు జస్టిస్‌ సతీమణి సంఘమిత్రదాస్‌

సిరిసిల్లటౌన్‌: ఖండాంతరాల్లో పేరెన్నికగన్న సిరిసిల్ల చే‘నేత’ కళ అద్భుతమని హైకోర్టు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ సతీమణి సంఘమిత్ర దాస్‌ అభివర్ణించారు. శనివారం సిరిసిల్లకు వచ్చిన ఆమెకు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో జాతీయత భావం ఉట్టిపడేలా అగ్గిపెట్టెలో ఇమిడే చీరను స్థానిక చేనేత శిల్పి వెల్ది హరిప్రసాద్‌ ప్రదర్శించగా..ఆమె తిలకించి మాట్లాడారు. అగ్గిపెట్టెలో చీర వినడమే కానీ నేరుగా తిలకించడం మొదటిసారి అన్నారు. ఈసందర్భంగా హరిప్రసాద్‌ను అభినందించి సత్కరించారు. ఆమెతో వచ్చిన హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ కె.సుజనకి సిరిసిల్ల న్యాయమూర్తులు బహూకరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ప్రేమలత, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీలేఖ, జూనియర్‌ సివిల్‌ జడ్జి సౌజన్య, ఉజ్జల్‌ భుయాన్‌ కూతురు శ్వేత, కోర్టు ఏవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement