తమ్ముడి అరంగేట్రం.. మహ్మద్‌ షమీ భావోద్వేగం!

6 Jan, 2024 07:29 IST|Sakshi

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ బెంగాల్‌ జట్టు తరపున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ అరంగేట్రం చేశాడు. రంజీట్రోఫీ-2024 సీజన్‌లో భాగంగా శుక్రవారం ఆంధ్ర జట్టుతో ప్రారంభమైన మ్యాచ్‌తో మహ్మద్ కైఫ్ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో తన తమ్ముడికి అభినందనలు తెలుపుతూ మహ్మద్‌ షమీ భావోద్వేగ పోస్ట్‌ చేశాడు.

"ఎట్టకేలకు నీవు అనుకున్నది సాధించావు. బెంగాల్‌ వంటి అద్బుత జట్టు తరపున రంజీ క్రికెట్‌ ఆడే అవకాశం లభించింది. నా దృష్టిలో ఇది నీవు సాధించిన గొప్ప విజయం. నీ కెరీర్‌లో మరింత ఎత్తుకు ఎదిగాలని కోరుకుంటున్నాను. జట్టు కోసం ప్రతీ మ్యాచ్‌లోను 100 శాతం ఎఫర్ట్‌ పెట్టి ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. కంగ్రాట్స్‌ కైఫ్‌ అని షమీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. కాగా మహ్మద్ కైఫ్ కూడా షమీ మాదిరే రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ కావడం విశేషం.

కాగా లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుండడంతో  కైఫ్‌కు ఈ ఏడాది రంజీ సీజన్‌లో తమ తొలి రెండు మ్యాచ్‌లకు ప్రకటించిన బెంగాల్‌ జట్టులో చోటు దక్కింది. 2021లో బెంగాల్‌ తరపున లిస్ట్‌-ఏ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. గతేడాది ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా కైప్‌ అదరగొట్టాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన కైఫ్‌ 12 వికెట్లు పడగొట్టాడు.

A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11)

>
మరిన్ని వార్తలు