Sakshi News home page

AUS vs SA: ఆసీస్‌తో టెస్టు సిరీస్‌.. జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా! స్టార్‌ బ్యాటర్‌ రీ ఎంట్రీ

Published Mon, Nov 14 2022 3:19 PM

South Africa name 16 member squad for Australia Tests - Sakshi

ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు డీన్‌ ఎల్గర్‌ సారథ్యం వహించనున్నాడు. కాగా ఆసీస్‌ సిరీస్‌కు ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ మార్‌క్రమ్‌ను ప్రోటీస్‌ సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం గమనార్హం. అదే విధంగా ఈ సిరీస్‌కు కీగన్ పీటర్సన్ కూడా గాయం కారణంగా దూరమయ్యాడు.

ఇక గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమైన ప్రోటీస్‌ కీలక ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డుసెన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న బ్యాటర్‌ డి బ్రుయిన్‌కు తిరిగి చోటు దక్కింది.  డి బ్రుయిన్‌ చివరిసారిగా 2019లో దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో ఆడాడు.

మరోవైపు యువ ఫాస్ట్‌ బౌలర్‌ గెరాల్డ్ కోయెట్జీ దక్షిణాఫ్రికా తరపున అరంగేట్రం చేయనున్నాడు. ఇక డిసెంబర్‌ 17న బ్రిస్బేన్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. కాగా టెంబా బావుమా సారథ్యంలో ప్రోటీస్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌-2022లో గ్రూపు దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు:  డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బావుమా, గెరాల్డ్ కోయెట్జీ, థ్యూనిస్ డి బ్రుయిన్, సరెల్ ఎర్వీ, సైమన్ హర్మర్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నార్ట్జే, కగిసో రబడ, గ్లెంటన్ స్టౌర్‌మాన్, కెన్ డ్యూస్లీ వెర్నీ, కె. , ఖయా జోండో

Advertisement

What’s your opinion

Advertisement