Sakshi News home page

కాంగ్రెస్‌ హయాంలో ఒరిగిందేమీ లేదు

Published Sun, Nov 12 2023 1:10 AM

 అనంతారంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి
 - Sakshi

పెన్‌పహాడ్‌: కాంగ్రెస్‌ హయాంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆ పార్టీ నాయకులకు వచ్చేది పదవులని.. బీఆర్‌ఎస్‌కు వేసే ఓటుతో ప్రజలకు సంక్షేమ పథకాలు వస్తాయని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం పెన్‌పహాడ్‌ మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం, అనంతారం, అన్నారం బ్రిడ్జి, అన్నారం, నారాయణగూడెం, నాగులపహాడ్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. రాబోయే ఎన్నికలు ప్రజల భవిష్యత్‌ను మార్చేవని పేర్కొన్నారు. ఎవరికి వేసిన ఓటు ఏం తెచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. కులాలు, మతాల పేరుతో కొందరు ఏకమవుతున్నారన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించే బాధ్యత తనదే అని స్పష్టం చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24గంటల విద్యుత్‌, కల్యాణలక్ష్మి లాంటి పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. గత పాలకుల హయాంలో అన్నీ ఉండి ఆగం అయిపోయామన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు కష్టాలు రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జెడ్పీటీసీ మామిడి అనితఅంజయ్య, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దొంగరి యుగేందర్‌, సర్పంచ్‌లు బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మీసాల రమణ, ధనియాకుల కోటమ్మ, మండలి మల్లయ్య, రాయిలి లక్ష్మి, చెన్ను శ్రీనివాస్‌రెడ్డి, పరెడ్డి సీతారాంరెడ్డి, ఎంపీటీసీలు మామిడి రేవతి, గద్దల నాగరాజు, జూలకంటి వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌లు నాతాల జానకిరాంరెడ్డి, వెన్న సీతారాంరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు మండాది నగేష్‌గౌడ్‌, దంతాల వెంకన్న, గుర్రం అమృతారెడ్డి, కట్ల నాగార్జున, పుట్ట సతీష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి

Advertisement

What’s your opinion

Advertisement