హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపైకి భారీగా చేరిన నీరు.. నగరవాసుల ఇక్కట్లు

14 Sep, 2023 17:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్‌ నగరంలో, శివారుల్లోనూ భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు భారీగా చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జంట నగరం సికింద్రాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో వాన పడింది.  దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. విద్యాసంస్థలు, ఆఫీసుల సమయం ముగియడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

మాదాపూర్, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో కురుస్తున్న వర్షం మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్‌పేట్‌, చందానగర్‌లో వర్షం. ఫిల్మ్‌నగర్,పంజాగుట్ట, అమీర్‌పేట్, బేగంపేట్‌, ఎస్‌ఆర్ నగర్‌లో వర్షం మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌లో వర్షం కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, నిజాంపేట్‌లో వర్షం పడింది.

మరోవైపు.. వర్షం మరికొన్ని గంటలపాటు కొనసాగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. 

videos credit goes to the respected owners

మరిన్ని వార్తలు