Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఐటీ సోదాలు.. ఏకంగా వంద బృందాలతో తనిఖీలు

Published Thu, Oct 5 2023 7:13 AM

IT Raids Hyderabad Oct 5 2023 Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరోసారి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ (IT) సోదాలు చర్చనీయాంశంగా మారాయి. ఏకంగా వంద బృందాలుగా ఏర్పడి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. గురువారం ఉదయం ఆరు గంటల నుంచే టీమ్‌లుగా విడిపోయి.. కొన్ని కంపెనీలతో పాటు కొందరి ఇళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టింది.ప్రధానంగా ఫైనాన్స్‌, చిట్‌ఫండ్‌ కంపెనీలే ప్రధానంగా ఈ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఆయా కంపెనీల డైరెక్టర్లు, బోర్డు మెంబర్ల ఇళ్లలోనూ తనిఖీలు సాగుతున్నాయి. 

అమీర్పేట్, శంషాబాద్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు శివారుల్లోని ప్రాంతాల్లో కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఎల్లారెడ్డి గూడ లోని పూజ కృష్ణ చిట్ ఫండ్స్‌పై 20 టీమ్స్‌ తనిఖీలు చేపట్టింది. ఈ చిట్‌ఫండ్‌ డైరెక్టర్స్ సోంపల్లి నాగ రాజేశ్వరి, పూజ లక్ష్మీ, ఎండి కృష్ణ ప్రసాద్ ఇళ్లపై కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు  జీవన్ శక్తి చిట్ ఫండ్, ఈ కామ్ చిట్ ఫండ్ లపై సోదాలతో పాటు దాదాపు 60 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఐటీ రిటర్న్స్‌ తదితర వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

కూకట్‌పల్లి హోసింగ్ బోర్డ్ 7వ ఫేజ్‌లోని ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్స్‌లో ఐటీ రైడ్స్‌ కొనసాగుతున్నాయి. చిట్‌ఫండ్‌ కంపెనీ ఓనర్‌ అరికేపుడి కోటేశ్వర రావుతో పాటు రైల్వే కాంట్రాక్టర్‌ వర ప్రసాద్ నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు మాగంటి వజ్రనాథ్‌తో పాటు వ్యాపారవేత్తలు ప్రసాద్‌, కోటేశ్వరరావు, రఘ్‌వీర్‌(శంషాబాద్) ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. చిట్ ఫండ్స్, ఫైనాన్స్ సంస్థల్లో ఆదాయపన్ను చెల్లింపులో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలతో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

చెన్నై: మరోవైపు తమిళనాడులోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. నలభై చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టింది ఐటీ. డీఎంకే జగత్‌ రక్షకన్‌ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement