Sakshi News home page

ఎమ్మెల్యేలకు ఎర కేసు: లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ విత్‌ డ్రా చేసుకున్న ప్రభుత్వం

Published Wed, Feb 8 2023 6:47 PM

MLAs Poaching Case: TS Govt Withdraws Lunch Motion Petition High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్ వద్ద దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం విత్‌డ్రా చేసుకుంది. మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ వేగం పెంచింది. కేసు వివరాలు ఇవ్వాలని సీఎస్‌కు సీబీఐ మరో లేఖ రాసింది. ఎఫ్‌ఐఆర్‌, ప్రాథమిక సాక్ష్యాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు తెలంగాణ సర్కార్‌కు సీబీఐ 5 లేఖలు రాసింది.

కాగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే వరకు ఆ తీర్పు అమలును నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అత్యవసర లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ దర్యాప్తు చేయాలంటూ ఇచ్చిన తీర్పును మూడువారాలపాటు నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు.

ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి.. ద్విసభ్య ధర్మాసనం తీర్పు తర్వాత స్టే కోసం సింగిల్‌ జడ్జిని ఆశ్రయించవచ్చో లేదో చీఫ్‌ జస్టిస్‌ నుంచి స్పష్టత తీసుకుని చెప్పాలని ఏజీని ఆదేశించారు. 
సింగిల్‌ బెంచ్‌లో జరిగిన వాదనలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

What’s your opinion

Advertisement