Sakshi News home page

యూపీఐ ట్రాన్సాక్షన్ల జోరు.. డెబిట్‌ కార్డులు బేజారు!.. మూడేళ్లలో 428% పెంపు

Published Tue, Sep 12 2023 3:22 PM

RBI Data: UPI Crosses 10 Billion Transactions in August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డిజిటల్‌ లావాదే­వీలతో మనోళ్లు దుమ్మురేపుతున్నారు. యూపీఐ పేమెంట్స్‌ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన డబ్బు బదిలీ (మనీ ట్రాన్స్‌ఫర్‌)గా నేడు అవతరించింది. అందుకే మునుపెన్నడూ లేనంత స్థాయిలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ట్రాన్సాక్షన్ల జోరు కొనసా­గుతోంది. మూడు, నాలుగేళ్ల కిందట ప్రధా­నంగా బ్యాంక్‌ డెబిట్, క్రెడిట్‌ కార్డులతో అత్యధికంగా పలు రకాల లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాలు జరిగిన విషయం తెలిసిందే. కోవిడ్‌ మహమ్మారి కాలం తెచ్చిన మార్పు చేర్పులతో డెబిట్, క్రెడిట్‌ కార్డుల వినియోగాన్ని తోసిరాజని యూపీఐ లావాదేవీలు ఇప్పుడు అగ్రపీఠాన్ని అధిరోహించాయి.

యూపీఐ ద్వారా... చిన్న మొత్తంలో కొనుగోళ్లు, ఇతరత్రా చెల్లింపులకు అవ­కాశం ఉండడంతో వాటివైపే అత్యధికుల మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమైంది. రోజు­వారీ నిత్యావసర కొనుగోళ్లు మొదలు, మార్కెట్‌లో వివిధరకాల వస్తువుల కొను­గోలుకు యూపీఐ చెల్లింపు విధానాన్ని మెజారిటీ వినియోగదారులు అనుసరి­స్తున్నారు. గత మూడేళ్లలో 428 శాతం యూపీఐ ట్రాన్సా­క్షన్లు పెరగ్గా, గత నెలలో (ఆగస్టులో) రూ.పది బిలియన్ల (బిలియన్‌ = 100 కోట్లు) ట్రాన్సాక్షన్ల నమోదుతో తొలిసారి రికార్డ్‌ సృష్టించాయి.

మూడేళ్లుగా డిజిటల్‌ లావాదేవీలు
కోవిడ్‌ నుంచి మూడేళ్లుగా క్రమంగా డిజిటల్‌ లావా­దేవీ­లు పెరిగాయి. ఎంతగా అంటే.. 2023–­24 ఆర్థికసంవత్సరంలో (ఏప్రి­ల్‌–జూలైల మధ్య) చెల్లింపుల విషయా­నికొస్తే..­క్రెడిట్‌కార్డుల ద్వారా రూ.5.57 ట్రిలియన్లు,  డెబిట్‌­కార్డులతో రూ.13 ట్రిలి యన్లు, యూపీఐ ద్వారా రూ.59.14 ట్రిలియన్ల (ట్రిలియన్‌ = లక్ష కోట్లు)లో జరిగిన­ట్టు వెల్లడైంది. ఆర్‌బీఐ డేటా ఆధారంగా రూపొందించిన నివేది­కలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. కరోనా తెచ్చిన మార్పులతో భారతీ­యులు అనుస రిస్తున్న వ్యయం తీరులో మార్పులు వచ్చి నట్టుఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
చదవండి: పనిచేస్తున్న బ్యాంకులోనే రూ.8.5 కోట్లు స్వాహా చేసిన డిప్యూటీ మేనేజర్‌

కీలకాంశాలు
► 2020 జూలైలో డెబిట్‌కార్డుల ద్వారా చేసిన చెల్లింపులు రూ.2.81 ట్రిలియన్లు కాగా. 2023 జూలైలో అవి రూ.3.15  ట్రిలియన్లుకు... 
అంటే 11.96 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేశాయి.
► ఇదే సమయంలో యూపీఐ చెల్లింపులు అనేవి రూ.2.90 ట్రిలియన్ల నుంచి రూ.15.33 ట్రిలియన్లకు..
అంటే  428 శాతం పెరుగుదలను రికార్డ్‌ చేశాయి
►మరోవైపు క్రెడిట్‌కార్డుల ద్వారా చెల్లింపులు కూడా పెరుగుతున్నాయి
► 2020 జూలైలో రూ.0.45 ట్రిలియన్ల చెల్లింపులతో పోల్చితే 2023 జూలై నాటికి అవి రికార్డ్‌ స్థాయిలో రూ.1.45 ట్రిలియన్లకు చేరుకున్నాయి
► కస్టమర్లు చెల్లిస్తున్న పద్ధతుల్లో భారీ మార్పుల వస్తున్నా డెబిట్‌కార్డుల వినియో­గం పూర్తిగా కనుమ­రుగయ్యే అవకాశాలు లేవు. మార్కె­ట్‌లో వాటి స్థానం పదిలమని నిపుణుల అంచనా.

20 బిలియన్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదు
చిన్న చిన్న మొత్తాల్లో చెల్లింపులు పెరగడం, ఫోన్‌ ద్వారా యూపీఐ లావాదేవీల వెసులుబాటుతో.. సంప్రదాయ చెల్లింపు పద్ధతిగా ఉన్న కస్టమర్ల  డెబిట్‌కార్డుల వినియోగం అనేది బాగా తగ్గింది. దీనిని బట్టి వచ్చే 18–24 నెలల కాలంలో యూపీఐ లావాదేవీలు నెలకు రూ.20 బిలియన్లకు చేరుకున్నా ఆశ్చర్యపడక్కర లేదు.
–సునీల్‌ రంగోలా, సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్, హెడ్‌ –స్ట్రాటజీ,ఇన్నోవేషన్, అనాలిటిక్స్, వరల్డ్‌లైన్‌ ఇండియా

Advertisement

What’s your opinion

Advertisement