Sakshi News home page

Telangana Rainfall Update: తెలంగాణలో రేపు ఈ జిల్లాలకు భారీ వర్షాలు, హైదరాబాద్‌లో వాతావరణం ఇలా..

Published Thu, Aug 17 2023 4:07 PM

Telangana Weather Updates: Moderate To Heavy Rains These Districts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో  ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాగల 12 గంటల్లో  అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే పశ్చిమ, వాయువ్య  దిశల నుంచి తెలంగాణ  వైపు గాలులు వీస్తుండగా.. మూడు రోజులపాటు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

రాగల మూడు రోజుల పాటు  తెలంగాణ రాష్ట్రంలో  చాలా చోట్ల వర్షాలు కురవనున్నాయి. రేపు(శుక్రవారం), ఎల్లుండి(శనివారం) అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. మూడు రోజులు  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.  

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాలలో రేపు(శుక్రవారం) భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే రెండు రోజులపాటు ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. 

ఇక రాజధాని హైదరాబాద్ నగరంలో వచ్చే రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
 

Advertisement

What’s your opinion

Advertisement