Sakshi News home page

నేడు దివ్వెల పండుగ

Published Sun, Nov 12 2023 1:08 AM

- - Sakshi

లక్ష్మీ పూజలు, నోములు ప్రత్యేకం

కిక్కిరిసిన రహదారులు

హన్మకొండ కల్చరల్‌: దీపావళి పండుగను ఆదివారం జరుపుకునేందుకు నగర ప్రజలు సిద్ధమయ్యారు. లక్ష్మీదేవికి నీరాజనాలు పలుకుతూ సంప్రదాయం ప్రకారం.. దీపాలు వెలిగిస్తారు. పురాతన శివాలయాల్లో దీపదానం చేయడం, దీపాలు వెలిగిస్తారు.

లక్ష్మీ పూజలు ప్రత్యేకం

ఐశ్వర్యాలు ప్రసాదించే మహాలక్ష్మీదేవికి వ్యాపారులు దీపావళి రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. వ్యాపారులు సాయంత్రం వేళ లక్ష్మీపూజలు నిర్వహించిన అనంతరం బాణసంచా కాలుస్తారు. కేదారేశ్వర వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నోముతారు.

కిక్కిరిసిన రహదారులు

దీపావళి నోముకు సంబంధించిన కొనుగోళ్లతో నగరంలోని ప్రధాన రహదారులు కిక్కిరిశాయి. హయగ్రీవాచారి గ్రౌండ్‌, వరంగల్‌ చౌరస్తా, బట్టల బజా ర్‌లో బాణసంచా దుకాణాలు కిటకిటలాడాయి.

Advertisement

What’s your opinion

Advertisement