Sakshi News home page

కదంతొక్కిన బుల్

Published Thu, Sep 18 2014 7:00 PM

స్టాక్మార్కెట్ పరుగులు పెట్టింది. సానుకూల సంకేతాలతో సూచీలు ఊర్థ్వముఖంగా పయనించాయి. చైనా కేంద్ర బ్యాంకు నుంచి భారీ సహాయక ప్యాకేజీ, ఫెడరల్ రిజర్వ్ సమీక్ష ఫలితాలు అనుకూలంగా ఉండడంతో మార్కెట్లు కదం తొక్కాయి. సెన్సెక్స్ మరోసారి కీలక 27 వేల పాయింట్ల స్థాయిని దాటింది. సెన్సెక్స్ 481 లాభపడి 27,112 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 139 పాయింట్లు ఎగసి 8,114 వద్ద స్థిరపడింది. కాగా, ఒక సెషన్ లో సెన్సెక్స్ ఇంత భారీగా లాభపడడం మూడు నెలల తర్వాత ఇదే మొదటిసారి. జూన్ 2న సెన్సెక్స్ 467 పాయింట్లు పెరిగింది.

Advertisement

What’s your opinion

Advertisement