-
నేటి నుంచి ప్రొ వాలీబాల్ లీగ్
కొచ్చి: లీగ్ తెరపైకి కొత్తగా వాలీబాల్ వచ్చింది. స్కూల్, కాలేజ్ గ్రౌండ్లతో పాటు అక్కడక్కడ కనిపించే ఈ క్రీడ టీవీల్లో కనువిందు చేసేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ప్రొ వాలీబాల్ లీగ్ తొలి సీజన్ మొదలవుతోంది. ఆరు ఫ్రాంచైజీ జట్లు రెండు వేదికలు కొచ్చి, చెన్నైలో తలపడతాయి. మొదట 12 లీగ్ మ్యాచ్‌లు ఇక్కడ జరుగుతాయి. మరో ఆరు మ్యాచ్‌లు, సెమీఫైనల్స్, ఫైనల్ పోటీలు చెన్నైలో నిర్వహిస్తారు. ఈ నెల 22న టైటిల్ పోరు జరుగుతుంది. శనివారం కొచ్చి బ్లూ స్పైకర్స్, యూ ముంబా వాలీ జట్ల మధ్య ఇక్కడి రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు జట్లతో పాటు బ్లాక్‌హాక్స్ హైదరాబాద్, అహ్మదాబాద్ డిఫెండర్స్, కాలకట్ హీరోస్, చెన్నై స్పార్టన్స్ బరిలో ఉన్నాయి. లీగ్ దశను 15 పాయింట్ల విధానంలో ఐదు సెట్ల మ్యాచ్‌లుగా నిర్వహిస్తారు. విజయానికి 2 పాయింట్లు లభిస్తాయి. ఐదు సెట్లూ గెలిస్తే వైట్‌వాష్‌గా పేర్కొంటారు. ఇలా చేస్తే అదనంగా మూడు పాయిట్లు లభిస్తాయి. ప్లే ఆఫ్ మ్యాచ్‌లను 25 పాయింట్ల విధానంలో నిర్వహిస్తారు. ప్రొ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)కు రూపే స్పాన్సర్షిప్ చేస్తోంది. -
అటు ఆంధ్ర... ఇటు హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: మరోసారి సమష్టి ఆటతీరుతో అదరగొట్టిన ఆంధ్ర, హైదరాబాద్ జట్లు విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. గ్రూప్ ‘సి’లో ఆంధ్ర జట్టు ఆడిన ఆరు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది 24 పాయింట్లతో ‘టాపర్’గా నిలువడం విశేషం. గ్రూప్ ‘డి’లో హైదరాబాద్ ఐదు విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించింది. భరత్, విహారి సెంచరీలు చెన్నైలో ముంబై జట్టుతో జరిగిన చివరిదైన ఆరో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 29 పరుగులతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 344 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ కోన శ్రీకర్ భరత్ (126 బంతుల్లో 106; 10 ఫోర్లు)... కెప్టెన్ గాదె హనుమ విహారి (118 బంతుల్లో 169; 16 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీలతో ముంబై బౌలర్ల భరతం పట్టారు. ఈ టోర్నీలో భరత్కిది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. భరత్, విహారి రెండో వికెట్‌కు 254 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక చివర్లో రికీ భుయ్ (31 బంతుల్లో 53; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) బౌండరీలతో చెలరేగి అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం 345 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 50 ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగులు చేసి ఓడిపోయింది. సిద్దేశ్ లాడ్ (98 బంతుల్లో 118; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. ఆంధ్ర బౌలర్లలో కార్తీక్ రామన్ (3/55), ఆశిష్ (2/51) రాణించారు. మెరిసిన సందీప్, సిరాజ్ ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 84 పరుగులతో భారీ విజయం నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 280 పరుగులు చేసింది. 60 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన హైదరాబాద్‌ను బావనాక సందీప్ (95 బంతుల్లో 79; 4 ఫోర్లు, ఒక సిక్స్), కెప్టెన్ అంబటి రాయుడు (65 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించి ఆదుకున్నారు. రాయుడు అవుటయ్యాక టి.రవితేజ (35 బంతుల్లో 45; 4 ఫోర్లు, ఒక సిక్స్)తో కలిసి సందీప్ ఐదో వికెట్‌కు 64 పరుగులు జతచేశాడు. చివర్లో ఆకాశ్ భండారి (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా ఆడాడు. 281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఛత్తీస్‌గఢ్‌ను హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (5/37) హడలెత్తించాడు. సిరాజ్ ధాటికి ఛత్తీస్గడ్ 44.3 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. మెహదీ హసన్ రెండు వికెట్లు తీయగా... రవికిరణ్, ఆకాశ్ భండారి, సందీప్‌లకు ఒక్కో వికెట్ లభించింది. గ్రూప్ ‘ఎ’ నుంచి బరోడా, కర్ణాటక; గ్రూప్ ‘బి’ నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర; గ్రూప్ ‘సి’ నుంచి ముంబై; గ్రూప్ ‘డి’ నుంచి సౌరాష్ట్ర క్వార్టర్ ఫైనల్‌కు చేరిన మిగతా జట్లు. నాకౌట్ దశ మ్యాచ్‌లు ఈనెల 21 నుంచి 27 వరకు న్యూఢిల్లీ వేదికగా జరుగుతాయి. 21న రెండు క్వార్టర్ ఫైనల్స్... 22న మరో రెండు క్వార్టర్స్ ఫైనల్స్ నిర్వహిస్తారు. 24న, తొలి సెమీఫైనల్, 25న రెండో సెమీఫైనల్... 27న ఫైనల్ జరుగుతుంది. -
సెమీఫైనల్లో హైదరాబాద్ జట్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలబాలికల జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన బాలుర విభాగంలో పోటీల్లో హైదరాబాద్ 3-1తో నిజామాబాద్‌పై, రంగారెడ్డి 13-0తో కరీంనగర్‌పై గెలుపొందాయి. మిగతా మ్యాచ్‌ల్లో మహబూబ్‌నగర్ 8-2తో నిజామాబాద్‌పై, వరంగల్ 10-0తో కరీంనగర్‌పై, మెదక్ 6-5తో రంగారెడ్డిపై, నిజామాబాద్ 10-0తో నల్లగొండపై, మహబూబ్‌నగర్ 6-5తో మెదక్‌పై గెలిచాయి. బాలికల మ్యాచ్‌ల్లో హైదరాబాద్ 9-4తో నిజామాబాద్‌పై, మెదక్ 13-12తో వరంగల్‌పై, రంగారెడ్డి 4-3తో మహబూబ్‌నగర్‌పై, వరంగల్ 10-0తో నల్లగొండపై, నల్లగొండ 13-9తో ఆదిలాబాద్‌పై, హైదరాబాద్ 12-4తో వరంగల్‌పై విజయం సాధించాయి. నేడు (సోమవారం) సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
దారుణం: ప్రియుడిపై మోజు.. భర్తను అంతమొందించిన భార్య!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దారుణం: ప్రియుడిపై మోజు.. భర్తను అంతమొందించిన భార్య!
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement