-
కల్లులందు కర్జూర కల్లు వేరయా! ఫుల్ డిమాండ్.. ఆరోగ్యానికి మేలు కూడా?
సహజసిద్దంగా చెట్ల నుంచి లభించే కల్లు అంటే ఇష్టపడని వారు ఉండరు. గ్రామీణప్రాంత ప్రజలైతే మరింత ఆసక్తి చూపుతారు. తీపి, ఒగరు, పులుపుగా ఉండే కల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిస్తే ఇక జనం ఆగరు. ఇప్పటి వరకు మనకు తాటి, ఈత, వేప కల్లు మాత్రమే తెలుసు. కానీ కర్జూర చెట్లు సైతం కల్లునిస్తు జనాన్ని ఫిదా చేస్తున్నాయి. జనగామ జిల్లాలో కర్జూర కల్లు జనాలకు మజానిస్తోంది. ప్రజల మనసు దోచుకుంటున్న ఈ ప్రత్యేక పానీయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. గ్రామీణ ప్రాంతాల్లో కల్లు సేవించడం సంప్రదాయంగా ఉంది. అయితే తాటికల్లు, ఈత కల్లు మాత్రమే జనాలు ఎక్కువగా సేవించేవారు. కానీ, తాజాగా కర్జూర కల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. సహజసిద్ధమైన ఈకల్లు ఆరోగ్యంతో పాటు, ఆనందాన్ని ఇస్తోంది. కిడ్నీల్లో రాళ్లను పోగొడుతుందని కల్లు ప్రియులు అంటున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ లో కొందరు రైతులు కర్జూర చెట్లను సాగుచేశారు. ఆచెట్ల నుంచి స్థానిక గౌడకులస్థులు కల్లు తీస్తు జనాలను ఆకర్షిస్తున్నారు. (చదవండి: తోడు కోసం అడవి దాటుతున్న మగ పులులు) సాధారణంగా తాటికల్లు, ఈతకల్లు చేదుగా, పుల్లగా, కొన్నిసార్లు తియ్యగా ఉంటుంది. కొన్నిసార్లు వగరుగానూ ఉంటుంది. ఈత, తాటికల్లు సేవించేందుకు కొందరు ఇష్టపడరు. కానీ, కర్జూర కల్లు మాత్రం తియ్యగా, టేస్టీగా ఉండడంతో అందరూ తాగుతున్నారు. తెల్లారిందంటే చాలు చెట్ల క్రిందికి చేరిపోతున్నారు. కర్జూర కల్లు టేస్ట్ తో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు, ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవాపూర్ కర్జూర కల్లుకు ఒకబ్రాండ్ గా మారింది. ఒకసారి ఈకల్లు తాగినోళ్లు పదేపదే వస్తున్నారు. దీని టేస్ట్ గురించి తెలుసుకుని వరంగల్, జనగామ ప్రజలతో పాటు హైదరాబాద్ వాసులు కూడా తరలివస్తున్నారు. ఉదయమే కర్జూర కల్లు తాగితే చాలా అద్భుతంగా ఉంటుందని కల్లుప్రియులు చెబుతున్నారు. మరో ప్రత్యేకత తాటిచెట్లు, ఈతచెట్లు కొన్ని నెలలు మాత్రమే కల్లునిస్తాయి. కానీ కర్జూర చెట్లు మాత్రం సంవత్సరం పొడవునా కల్లును ఇవ్వడం ఈచెట్ల ప్రత్యేకత. రాఘవాపూర్ లో ఐదు కర్జూర చెట్లు ఉండగా ఒక్కో చెట్టు రోజుకు 20 లీటర్ల కల్లు పారుతుంది. లీటర్ కు వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. అమృతంలా ఆరోగ్యానికి మేలుచేస్తుండడంతో కర్జూర కల్లు కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని గౌడ కులస్తులు తెలిపారు. డిమాండ్ బాగానే ఉన్నా చెట్లు తక్కువగా ఉండి అందరికీ కల్లు అందించలేక పోతున్నామని అంటున్నారు. ఇక డిమాండ్ కు తగ్గట్లు సప్లై లేక చాలా మంది కల్లు దొరక్క నిరాశతో వెనుతిరిగి పోతున్నారు. ప్రభుత్వం హరితహరం క్రింద రోడ్లకు ఇరువైపులా ప్రభుత్వ భూముల్లో కర్జూర చెట్లు పెంచి తమ ఉపాధి మెరుగుపర్చాలని కల్లుగీత కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రజలకు ఆరోగ్యవంతమైన కర్జూర కల్లును అందిస్తామంటున్నారు. (చదవండి: పోలీసులందు ఈ పోలీస్ వేరయా.. దొంగలతో చేతులు కలిపి ‘ముఠా’ నేతగా ఎదిగి) -
కాజల్ కల్లుకు సమంతాతో పోటీ
కాజల్.. ఇలియానా.. సమంతా.. తమన్నా.. నయనతార.. ఐశ్వర్యారాయ్.. వీళ్లంతా హీరోయిన్లు మాత్రమేనని అనుకుంటున్నారా? కాదు, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమర్రిలో ఉన్న తాడిచెట్లకు కూడా ఇవే పేర్లున్నాయి. అంతేకాదు, ఈ చెట్ల కల్లుకు ఎక్కడ లేని డిమాండు ఉంది. టాలీవుడ్, బాలీవుడ్‌లలోనే కాదు.. ఇక్కడ చిరుమర్రిలో కూడా హీరోయిన్లు తెగ పోటీ పడుతున్నారు. ఒక్కో హీరోయిన్ చెట్టు నుంచి వచ్చే కల్లుది ఒక్కో టేస్టు అని, తమకు ఫలానా హీరోయినే కావాలని కల్లుప్రియులు ఇక్కడికొచ్చి గారాలు పోతుంటారు. స్వచ్ఛమైన, కల్తీ లేని కల్లుకు చిరుమర్రి ఫేమస్ అని వాళ్లు చెప్పుకొంటున్నారు. అయితే.. ఏ చెట్టు నుంచి ఏ రుచి ఉండే కల్లు వస్తుందో గుర్తుపెట్టుకోవడం కష్టం కావడంతో, ఓ కల్లుగీత కార్మికుడికి ఈ ఆలోచన వచ్చింది. వెంటనే తన ఆధీనంలో ఉన్న చెట్లకు కాజల్, సమంతా, ఇలియానా అని పేర్లు పెట్టేశాడు. సరిగ్గా ఈ ఐడియా ఇక్కడి కల్లుగీత కార్మికులందరి జీవితాలను మార్చేసింది. అంతే, ఇక్కడున్నవాళ్లంతా తమ తమ చెట్లకు తమకు ఇష్టమైన హీరోయిన్ల పేర్లు పెట్టుకుంటూ వచ్చేశారు. అంతేకాదు, ఆ చెట్లను గుర్తుపట్టేందుకు వీలుగా చెట్టుకు హీరోయిన్ల బొమ్మలు అతికించేశారు. ప్రస్తుతం నయనతార, తమన్నా, కాజల్, త్రిష, సమంత పేర్లున్న చెట్లకు డిమాండ్ ఉంది. ఇలా కల్లుకు సినీ తారల పేర్లు జోడించడంతో కల్లు ప్రియులకు ఏ రకం కల్లు కావాలో తెలుసుకుని, దాన్ని అమ్మడానికి సులువు అవుతోందంటున్నారు కల్లు గీత కార్మికులు. మొత్తానికి సినిమా తారల పేర్లతో .. ఇక్కడ జరుగుతున్న కల్లు విక్రయాలకు మంచి డిమాండే లభిస్తోంది.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
సంక్షేమ సిరిమల్లిక
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్‌దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
Advertisement