-
Cyber Attack: యూట్యూబ్ లైక్ కొడితే రూ.77 లక్షలు దోచుకున్నారు!
ఏటికేటా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ను ఊతంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఆశచూపి సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. దీంతో అమాయకులు బలవుతున్నారు. లక్షల్లో నగదు పోగొట్టుకున్నాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని కేసుల్లో నగదు రికవరీ అవుతున్నా, మరికొన్ని ఘటనల్లో నగదు కోసం బాధితులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఆన్లైన్ జాబ్స్, పార్ట్‌టైం జాబ్స్ ఆశచూపి తాజాగా 56 ఏళ్ల వ్యక్తి దగ్గర ఏకంగా రూ.77 లక్షలు కొట్టేసిన ఘటన నాగ్‌పుర్‌లో చోటుచేసుకుంది. యూట్యూబ్ లైక్‌ల ద్వారా నగదు సంపాదించవచ్చు అని చెప్పి సైబర్ నేరగాళ్లు నాగ్‌పుర్‌కు చెందిన 56 ఏళ్లు సరికొండ రాజు అనే వ్యక్తిని టెలిగ్రాం ద్వారా తొలుత సంప్రదించారు. తమ వద్ద ఒక ఉద్యోగ అవకాశం ఉందని, సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించారు. ఇష్టమైన యూట్యూబ్ ఛానల్‌ను లైక్చేసి స్క్రీన్ షాట్లు పంపాలని కోరారు. అయితే ప్రారంభంలో అంతా మంచిగానే అనిపించింది. తనకు ఎటువంటి ఇబ్బంది రాదని రాజు భావించాడు. తాను చేసిన పనికి డబ్బులు కూడా వస్తుండడంతో సైబర్ నేరగాళ్లపై ఎలాంటి అనుమానం రాలేదు. దాంతో తన బ్యాంకు ఖాతా వివరాలను వారితో పంచుకున్నాడు. ఇదే అదనుగా భావించి సైబర్ నేరగాళ్లు రాజు బ్యాంక్ ఖాతా నుంచి అనధికార లావాదేవీలు నిర్వహించారు. ఏకంగా రూ.77 లక్షలు దోచుకున్నారు. చేసేదేమిలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు, ఓ బుకీని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మరో కోణం బయటపడింది. ఇటీవల జరిగిన భారత్ పాక్ ప్రపంచ కప్ మ్యాచ్‌పై బెట్టింగ్ పాల్పడినట్లు సదరు బుకీ అంగీకరించాడు. పార్ట్ టైం ఉద్యోగాలు, సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు అంటూ ఎవరైనా ఆశచూపిస్తే జాగ్రత్తగా ఉండాలని, వారు ఎంత మభ్యపెట్టినా.. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను పంచుకోకూడదని పోలీసులు తెలిపారు. -
‘గంగవ్వ’ ఎరుకనే కదా..!
సాక్షి, మల్యాల(పెద్దపల్లి): అచ్చమైన తెలంగాణభాష ఆమె సొంతం. అమాయకమైన చూపులు.. శివాలెత్తే మాటలకు కేరాఫ్‌గా నిలుస్తోంది మై విలేజ్ షో ఫేం గంగవ్వ. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ దినసరి కూలీ. తనకు రాని నటనతోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మై విలేజ్‌షో అనే ఛానల్‌తో యూ ట్యూబ్ ఐకాన్‌గా మారింది. గంగవ్వ కనపడితే చాలు ఒక్క సెల్ఫీ అంటూ యువత పోటీ పడుతున్నారు. నటనతెలియని గంగవ్వకు ఏకంగా పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లు ఆఫర్ ఇవ్వడం ఆమె ప్రతిభకు నిదర్శనం. వ్యవసాయ కూలీనుంచి.. మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన మిల్కూరి గంగవ్వ ఉరఫ్ మై విలేజ్ షో గంగవ్వ వ్యవసాయ కూలీ. డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్ పట్టా పొందిన అదే గ్రామానికి చెందిన శ్రీరాం శ్రీకాంత్ పల్లెటూరి సంస్కృతిని చాటిచెప్పేందుకు మై విలేజ్ షో అనే యూట్యూబ్ఛానల్ను దాదాపు ఐదేళ్లక్రితం ప్రారంభించాడు. తమ ఇంటి సమీపంలో ఉండే గంగవ్వ హుషారుతనం.. చలాకీ మాటలు.. అచ్చ తెలంగాణభాషను గుర్తించాడు. తన ఛానల్లో నటించడానికి అవకాశం ఇచ్చాడు. అలా సాగిన తన ఐదేళ్ల ప్రస్థానంలో ఇప్పుడు గంగవ్వ లేనిదే మై విలేజ్‌షో లేదు అనేంతగా ఫేమస్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.. గంగవ్వ మై విలేజ్ షో షార్ట్ ఫిల్మ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ ఛానల్లో ఇప్పటి వరకు 100కు పైగా షార్ట్‌ఫిల్మ్‌ల్లో నటించింది. ప్రతీ వీడియోలో తన ప్రత్యేకతను చాటుకుంది. మొన్నటి సంకాంత్రికి భీమవరంలో కోడిపందాలకు పోటీలు, తరువాత వచ్చిన ఎన్నికల్లో తీరును విశ్లేషిస్తూ ‘సెటైరికల్‌గా సర్పంచ్ గంగవ్వ’, నిన్నటి శివరాత్రి మహాత్యం వివరించే శివరాత్రి జాగారణ పేరుతో యూట్యూబ్ వీడియోలు తీస్తూ తన యాస,మాట తీరుతో గుర్తింపు పొందింది. ఓ వార్తాఛానల్లోని ప్రోగ్రాంలో ఏడాదిపాటు నటించింది. మరో వార్తాఛానల్లో రెండు పండుగ ఎపిసోడ్లు చేసింది. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం నాడు ఏర్పాటుచేసే ‘సినీవారం’లో సత్కారం పొందింది. సినీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ సమంతను కలిసింది. వాళ్లే గంగవ్వ నటనను యూట్యూబ్‌లో చూసి ఆహ్వానించడం విశేషం. గంగవ్వతో ఒక్క సెల్ఫీ.. ఒక్కసారి నీ తిట్లతో దీవించు అంటూ గంగవ్వను వెతుక్కుంటూ వెళ్లి, గంగవ్వ మాటలు, తిట్లకు సంబరపడిపోతున్నారు యువత. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు గంగవ్వతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడుతున్నారు. పల్లెటూరి యాసతోపాటు మాటతో ఆకట్టుకుంటోంది. పల్లెటూరి నుండి పట్నం దాకా ఎక్కడికివెళ్లినా గంగవ్వ ఒక్క సెల్ఫీ అంటూ ఎగబడుతున్నారు. చెప్పింది చేసుడే తెలుసు.. వ్యవసాయ పనికి పోయేదాన్ని. పని లేనప్పుడు బీడీలు చేసేదాన్ని. శ్రీకాంత్ మా వీడియోలో నటిస్తవా అని అడిగిండు. నాకు నటించుడు రాదు..నువ్వు చెప్పింది సేత్త అన్న. శ్రీకాంత్ చెప్పింది చెప్పినట్లు చేస్త గంతే. ఎవుసం పనిచేసుకునేదాన్ని తీసుకువచ్చి ప్రపంచానికి పరిచయం చేసిండు శ్రీకాంత్. సినిమాల్లో నటించు అంటే నా ఊరిని ఇడిసి ఎక్కడికి రాను అని చెప్పిన. మొన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ నన్ను పిలిచి సినిమాల నటించుమంటే నటించుడు రాదు సారు..మీరు చెప్పింది చెప్పినట్లు సేత్తా అంటే కొద్దిసేపు ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తీసుకున్నడు. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏ పనిచేసిన మంచిగనే ఉంటాం. – గంగవ్వ -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
అమర్ అక్బర్ ఆంటోని – థియెట్రికల్ ట్రైలర్ నిడివి 2 ని.02సె ,హిట్స్ 2,218,077 శ్రీను వైట్ల తొలి సినిమా ‘నీ కోసం’లో హీరో రవితేజాయే. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలసి ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ సినిమాలతో సక్సెస్ చూశారు. కాలం గడిచిపోయింది. ఇద్దరి జీవితాల్లోనూ ఎత్తుపల్లాలు వచ్చాయి. హీరోగా మళ్లీ ఒక సూపర్ హిట్ ఇవ్వాల్సిన అవసరం రవితేజాకి, దర్శకుడిగా తాన సత్తా చాటాల్సిన సందర్భం శ్రీను వైట్లకు వచ్చాయి. ‘ఆగడు’, ‘బ్రూస్లీ’, ‘మిస్టర్’ సినిమాలు శ్రీను వైట్లను నిరాశ పరిచాయి. కనుక మళ్లీ ఒక మేజిక్ కోసం పాత స్నేహితుడు రవితేజాతో జోడీ కట్టాడు. ‘అమర్ అక్బర్ ఆంటోని’ ట్రైలర్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటం తొలి పాజిటివ్ సంకేతం. ట్రైలర్లో మంచి ఎనర్జీ, మేకింగ్‌లో క్వాలిటీ, నటీనటుల ప్యాడింగ్, మ్యూజిక్... అన్నీ ఊపు మీద ఉన్నాయి. కథను విదేశాల్లో నడపడం వల్ల లొకేషన్లు కూడా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి. కథ ‘రివేంజ్’ పాయింటే అయితే శ్రీనువైట్ల తనదైన ఎంటర్టైన్మెంట్తో తీసినట్టు తెలుస్తోంది. ‘చెడ్డవాళ్ల నుంచి చెడును ఎక్స్పెక్ట్ చేయకపోవడం పిచ్చితనం’ వంటి పంచ్ డైలాగులు ఉన్నాయి. ‘అమర్ అక్బర్ ఆంటోని’ టైటిల్ చాలా హిట్ టైటిల్. దర్శకుడు మన్ మోహన్ దేశాయ్ అమితాబ్‌ను హీరోగా పెట్టి తీసిన ఈ సినిమా నేటికీ టీవీలో ఇంటిల్లిపాది కలెక్షన్లతో ఆడుతుంటుంది. ఆ క్యాచీ టైటిల్ కూడా సినిమాకు ప్లస్ కావచ్చు. ఏమైనా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిద్దాం. డిసెంబర్ 16 విడుదల. విలేజ్ దివాలి– కామెడీ షార్ట్ ఫిల్మ్ నిడివి 10 ని. 52 సె. ,హిట్స్ 1,830,539 దీపావళి అంటే గతంలో జేబులో డబ్బులు పెట్టుకుని సంచిలో టపాకాయలు తెచ్చేవాళ్లం. ఇప్పుడు సంచిలో డబ్బులు పెట్టుకొని జేబులో టపాకాయలు తెచ్చుకునేంత ఖరీదుగా మారాయి. ఈసారి దీపావళి మీద ఫోకస్ కూడా పెరిగింది. సుప్రీంకోర్టు ఎంత సేపు టపాకాయలు కాల్చలన్న సంగతిపై తీర్పు ఇవ్వడంతో కన్ఫ్యూజన్ వచ్చింది. అయితే జనం తీర్పును దాదాపు పక్కన పెట్టిన ఉదంతాలు కనిపించాయి. ఈ నేపధ్యంలో ‘మై విలేజ్ షో’ యూ ట్యూబ్ చానల్ వారు ‘విలేజ్ దివాలి’ ఫన్ వీడియో తీశారు. తెలంగాణ భాష మాధుర్యంతో ఆకట్టుకునే ఈ షో అక్కడి గ్రామస్తులే నటులైన కారణాన సహజరీతిలో ఉంటూ నవ్వు తెప్పిస్తుంది. ఈ షోలో ఒక పిసినారి తండ్రి టపాకాయలు కొనమని పీక్కు తినే పిల్లలను చివరకు చిల్లర తుపాకులు కొనిచ్చి ఊరుకోబెడతారు. పండక్కు అల్లుళొచ్చి అది కావాలి ఇది కావాలి అని పేచీకి దిగితే ఇద్దరు అత్తలు ఒక ప్లాన్ చేసి అల్లుళ్లను దారికి తెస్తారు. చివరలో పర్యావరణ సహిత టపాసులు కాల్చమని సందేశం కూడా ఉంది. సరదాగా చూడొచ్చు. వినయ విధేయ రామ– టీజర్ నిడివి 0 ని.49 సె. ,హిట్స్ 11,942,34 ఇప్పుడు తెలుగులో ఉన్న మొదటి ఐదు మాస్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. హీరోను ఎలివేట్ చేసి, అతనితో ముడిపడిన ఎమోషనల్ సీన్లను ప్లాన్ చేసి, భారీ ఫైట్లు పెట్టి, బలమైన డైలాగులు పెట్టి, పట్టు సడలని కథనంతో సినిమాను గట్టున పడేయడం ఆయన శైలి. ‘రంగస్థలం’లో సెమీ రియలెస్టిక్ నటన చూపి అభినయాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు దగ్గరైన రామ్‌చరణ్ తన మాస్ అభిమానులను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పని ‘వినయ విధేయ రామ’ తీర్చే సూచనలు టీజర్లో కనిపిస్తున్నాయి. మన దర్శకులు హీరోల వంశాలను, వారి తండ్రుల గొప్పతనాన్ని వదిలిపెట్టరు. ఈ సినిమారో హీరో పేరు ‘రామ్ కొణిదల’ అట. పాత్రను గుర్తించేలోపు దాని నుంచి బయటపడేసే ఇటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తారో. టైటిల్ బాగానే ఉన్నా బోయపాటి గత టైటిల్ ‘జయ జానకి నాయక’ వరుసలోనే ఉంది. భారీతనం మెండుగా ఉన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
భారతీయ రైల్ (షార్ట్ ఫిల్మ్– హిందీ) నిడివి 14 ని.47సె , హిట్స్ 2,413,235 కంట నీరు కురువని వాడు రైల్లో ప్రయాణించనివాడు భారతదేశంలో ఉండడు. రైలెక్కాక ఒక మినీ భారతదేశమే రైల్లో ఉంటుంది. వంద రకాల మనుషులు, మనస్తత్వాలు, మంచితనాలు, తెలివిడి మొహాలు, కయ్యాలు, కొట్లాటలు, టికెట్టు లేని ప్రయాణికులు, బిచ్చగాళ్లు, సరుకులమ్మే వాళ్లు, హిజ్డాలు... రైలు మొదలయ్యి గమ్యం చేరే లోపల అనంతమైన కార్యకలాపాలు సాగుతాయి. రైలునే జీవనాధారం చేసుకునేవారి మాట తీరు, జీవన నైపుణ్యం, లౌక్యం, దబాయింపు ఎవరూ మర్చిపోరు. రైలు చుట్టూ చాలా సాహిత్యం ఉంది. సినిమాలు ఉన్నాయి. ఈ షార్ట్ ఫిల్మ్ భారతీయ రైల్వేలలో నిత్యం తారస పడే ఘటనలను చూపించి నవ్వు తెప్పిస్తుంది. టాయిలెట్స్ దగ్గర నడవడానికి కూడా చోటు లేకుండా ఆక్రమించుకుని పడుకుని ఉండేవారిని దాటుకుని వెళ్లడం ఎంత కష్టమో– మనకు తెలిసిందే– మళ్లొకసారి చూసుకుంటే గిలిగింత పుడుతుంది. ఎవరో కుర్రాడు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి తన గర్ల్‌ఫ్రెండ్‌తో గంటలు గంటలు మాట్లాడి చంపుతుంటాడు. పేకాట ఆడేవాళ్లు, ఆస్తి మొత్తం టీసీకి రాసిచ్చైనా సరే బెర్త్ సంపాదించాలని తంటాలు పడేవాళ్లు, ఎదుటి వారికి అవసరం లేకపోయినా సలహాలు ఇచ్చేవాళ్లు... ఇండియాలో ఇంతే... ఇట్ హాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా అనిపిస్తుంది. ‘టి.వి.ఎఫ్’ వారి వీడియో ఇది. రైలును అభిమానించేవారు తప్పనిసరిగా చూడొచ్చు. మొహల్లా అస్సి (హిందీ సినిమా ట్రైలర్) నిడివి 2 ని. 31 సె. , హిట్స్ 9,476,593 కాశీ నగరం భారతీయ ఆధ్యాత్మికతలో అవిభాజ్యమైన నగరం. కాశీ ప్రమేయం లేని హైందవ ధర్మ వికాసం లేదు. శివ భక్తుల అంతిమ గమ్యస్థలి అది. అలాంటి నగరాన్ని రాజకీయ కారణాల రీత్యా, వ్యాపార కారణాల రీత్యా ఎలా కలుషితం చేస్తున్నారో చూప్తూ రచయిత కాశీనాథ్ సింగ్ ‘కాశీ కా అస్సి’ అనే నవల రాశారు. ‘అస్సి’ అంటే ఎక్కువగా విదేశీ టూరిస్టులు బస ఉండే కాశీలోని ఒక ఘాట్. ఆ నవల ఆధారంగానే ‘మొహల్లా అస్సి’ సినిమా తీశారు. అంటే ‘అస్సి చుట్టుపక్కల’ అని అర్థం. ఇందులో సన్ని డియోల్ ఒక ‘పండా’గా నటించాడు. దొంగ గురువులు, సాధువులు, రామ మందిర వివాదం ఇవన్నీ కాశీ మీద ఎలాంటి ఫ్రభావం చూపాయో ఈ సినిమాలో చూడొచ్చు. సెన్సార్ కారణాల రీత్యా విడుదల ఆలస్యమైన ఈ సినిమా నవంబర్ 16న విడుదల కానుంది. ఒకప్పుడు టీవీలో ‘చాణక్య’ నవల ద్వారా పాపులర్ అయిన నటుడు చంద్రప్రకాష్ ద్వివేది ఈ సినిమా దర్శకుడు. సవ్యసాచి (ట్రైలర్) నిడివి 1 ని. 39 సె. ,హిట్స్ 4,121,951 చందు మొండేటి అకౌంట్లో ‘కార్తికేయ’, ‘ప్రేమమ్’ సినిమాల విజయం ఉంది. అతడి మూడో సినిమా ‘సవ్యసాచి’. ఈ టైటిల్ మహిమ ఏమో కాని ఎన్నో ఏళ్లుగా ఈ టైటిల్‌తో సినిమా తీయాలని చాలామంది ట్రై చేసి విఫలం అయ్యారు. చివరకు నాగ చైతన్యకు రాసి పెట్టి ఉంది. తమిళుల తరహాలో ‘హీరోకు ఒక చేయి అతని అదుపులో ఉండదు’ అనే పాయింట్‌ని తీసుకుని, తమిళుల తరహాలోనే ఒక విలన్ (మాధవన్)ను అనుకుని ఈ సినిమా తీసినట్టుగా అనిపిస్తోంది. నవ్యత కోసం ప్రయత్నించారనడంలో సందేహం లేదు. భూమిక, నిధి అగర్వాల్ ఇతర ముఖ్య పాత్రలు. మైత్రీ మూవీస్ నిర్మాణం, కీరవాణి సంగీతం ఇవన్నీ ఈ ప్రాజెక్ట్‌కు లాభించే అంశాలు. థ్రిల్లర్లు ఈ మధ్య బాగా ఆడుతున్నాయి. ఆ వరుసలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ 2 విడుదల. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ఉత్తరం– షార్ట్ ఫిల్మ్ నిడివి 24 ని.04సె , హిట్స్ 91,283 ఉత్తరాలు పోయి ఈ మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్స్ పోయి మెసేజ్‌లు వచ్చాయి. మెసేజ్‌లు పోయి ఆ మెసేజ్ భాషలోని షార్ట్ కట్ మిగిలింది. థ్యాంక్యూ కి ’tq’. ఐ లవ్ యూ కి ’ILY’. లెట్ మి నో కు ’LMK’... ఇలా. ప్రేమ, అభిమానం, ఆప్యాయత... అన్నీ ఈ పొడి పొడి మాటల్లో ముక్కచెక్కలయ్యాయి. ఇవాళ మనసులోని భావాలను ఎదుటివారికి పరవడం లేదు. సరైన మాటల్లో మనసును తాకేలా నివేదించడం లేదు. ఉత్తరం రాయడం లేదు. ఒట్టి మాటలతో, వాట్సాప్‌లతో బంధాలు ముడిపడతాయా? ‘ఉత్తరం’ షార్ట్‌ఫిల్మ్ ఒక తాతా మనవడిది. ఊళ్లో ఉన్న తాత– భార్యతో గొడవ పడి విడాకుల దాకా వెళ్లి సెలవు మీద ఊరు చేరుకున్న మనవడితో చేసే సంవాదం ఈ కథ. భార్య పట్ల మనసులో నిజంగా ఏముందో, ఎంత ప్రేముందో తెలియాలంటే కావలసింది మధ్యవర్తులు, పంచాయితీలు, వాదనలు కాదని మంచి ఉత్తరం అని తాత చెబుతాడు. ఆ మేరకు మనవడి చేత రాయిస్తాడు. ఆ ఉత్తరానికి ఎటువంటి స్పందన వచ్చిందనేది ముగింపు. ఎల్.బి.శ్రీరామ్ సున్నితమైన అంశాలను తీసుకొని సాహిత్యం నుంచి ఎంపిక చేసుకున్న కథల ద్వారానో, లేదా సొంతంగా అల్లిన కథల ద్వారానో ఆకట్టుకునే షార్ట్‌ఫిల్మ్స్ తీస్తున్నారు. ఆ వరుసలో ఈ షార్ట్‌ఫిల్మ్ సామాజిక ప్రయోజనం కలిగినది అని చెప్పవచ్చు. ఇవాళ్టి తరానికి ఇటువంటి షార్ట్‌ఫిల్మ్స్ కొంత అవసరమే అనిపిస్తుంది. చిరాకులో ఉన్న దంపతులు తప్పక చూడాల్సిన ఫిల్మ్ ఇది. చక్కటి భాష, సంభాషణలు, దర్శకత్వం, లొకేషన్ ఉన్నాయి. ఎల్.బి.శ్రీరామ్, శర్మ లంక ముఖ్య పాత్రధారులు. హలో గురూ ప్రేమ కోసమే – ట్రైలర్ నిడివి 2 ని. 1 సె. ,హిట్స్ 4,211,561 రామ్ సినిమాలలో ‘నేనూ శైలజా’ తర్వాత వచ్చిన ‘హైపర్’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. వెంట వెంటనే హిట్స్ ఇవ్వడం, మార్కెట్లో డిమాండ్‌లో నిలవడం గ్లామర్ ప్రపంచంలో తప్పనిసరి. లేకుంటే ఈలోపు సమీకరణాలు మారిపోతాయి. హిట్స్‌ను బట్టి వేరే వేరే హీరోలొచ్చి స్లాట్స్‌ను తన్నుకుపోతారు. రామ్‌కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్పెసిఫిక్ ఏరియా ఉంది. యాక్షన్ కామెడీ సినిమాలను అతను ఒక్క చేత్తో లాక్కురాగలడు. లవ్ సబ్జెక్ట్స్ కూడా అతడికి మేచ్ అవుతాయి. అన్నీ సరిగ్గా కుదిరితే సినిమాను ఎక్కడికో తీసుకెళ్లగలడు. ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమా అతడికి అలాంటి అవకాశం ఇస్తుందా అనేది చూడాలి. గతంలో ‘సినిమా చూపిస్తా మావా’, ‘నేను లోకల్’ సినిమాలు తీసిన త్రినాథరావు నక్కిన ఈ సినిమాకు దర్శకుడు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ప్రకాశ్ రాజ్ వంటి సీనియర్ నటుడు హీరో ఫ్రెండ్‌గా డిఫరెంట్ క్యారెక్టర్ చేయడం ఫ్రెష్‌గా అనిపిస్తోంది. నిర్మాత దిల్ రాజు మెచ్చి తీసిన సినిమా అంటే ఏదో ఒక పాయింట్ ఉంటుందనే భావన ప్రేక్షకుల్లో ఉంటుంది కనుక సినిమా కోసం ఎదురుచూడటమే తరువాయి. హమీద్ – ట్రైలర్ నిడివి 2 ని. 36 సె. ,హిట్స్ 1,562,977 కశ్మీర్ లోయ నేపథ్యంగా చాలా సినిమాలే వచ్చాయి. అక్కడ అలజడుల్లో మనుషులు అదృశ్యం కావడం సర్వ సాధారణం. కొడుకులు అదృశ్యం అయిన తల్లులు, భర్తలు అదృశ్యమైన భార్యలు అక్కడ వందల కొలదీ కనిపిస్తారు. జీవచ్ఛవాలుగా బతుకీడుస్తుంటారు. ఆ అదృశ్యమైనవారు బతికారో చనిపోయారో కూడా తెలియనిదుర్భర సందిగ్ధావస్థ. ఈ సినిమాలో ఎనిమిదేళ్ల హమీద్ అనే కుర్రాడి తండ్రి కూడా అదృశ్యమవుతాడు. తల్లి కుదేలవుతుంది. హమీద్‌కు ఈ విషయం దేవుడి దగ్గర నిలదీయాలనిపిస్తుంది. ‘786’ దేవుడి నంబర్ అని ఎవరో చెబుతారు. దానికి అటూ ఇటూ నంబర్ కలిపి హమీద్ డయల్ చేస్తాడు. అది కశ్మీర్‌లోనే విధులు నిర్వహిస్తున్న ఒక సైనికుడికి వెళుతుంది. అతడు తానే ‘అల్లా’ అని అతడితో సంభాషణలో దిగుతాడు. వాళ్లిద్దరూ తమ తమ జీవితాల నుంచి ఏమి తెలుసుకున్నది పరస్పరం ఏమి ఇచ్చుకున్నది ఈ సినిమా. ‘సారెగమ’ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ఏజాజ్ ఖాన్ దర్శకత్వం వహించాడు. బాల నటుడిగా నటించిన ‘తల్హా అర్షద్’ మనసును కట్టి పడేస్తాడు. ఎదురు చూడదగ్గ సినిమా.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
Advertisement