Sakshi News home page

మధుమేహం : ఈ సూపర్‌ ఫుడ్‌తో చెక్‌ చెప్పొచ్చు!​ 

Published Sat, Mar 23 2024 3:24 PM

super food and health benefits for diabetes patients - Sakshi

ప్రస్తుత కాలంలో డయాబెటిస్‌ సమస్య అందరిలోనూ కనిపిస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య నానాటికి పెరిగి పోతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మధుమేహం విషయంలో, రక్తంలో చక్కెర స్థాయులను సాధారణంగా ఉండేలా చూసుకోవడం మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలి.

రక్తంలో చక్కెర స్థాయి తగ్గించుకోవడానికి కొన్ని సూపర్‌ఫుడ్‌ల సహాయం తీసుకోవచ్చు. అవేంటో చూద్దామా...

దాల్చిన చెక్క: రక్త ప్రవాహంలో చక్కెర కదలికను పెంచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

సొరకాయ: సొరకాయలో 92శాతం నీరు, 8శాతం  ఫైబర్‌ ఉంటుంది. దీనిలో గ్లూకోజ్, చక్కెర సంబంధిత సమ్మేళనాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్‌ రోగులకు అద్భుతమైన కూరగాయగా పరిగణిస్తారు.

కాకరకాయ: రుచికి చేదుగా ఉండే కాకరకాయలో పాలీపెప్టైడ్‌–పి ఉంటుంది. ఇది ఇన్సులిన్‌ లాంటి హైపోగ్లైసిమిక్‌ ప్రొటీన్‌. ఇది కణాలలోకి గ్లూకోజ్‌ని తీసుకురావడంలో సహాయపడుతుంది.

మెంతులు: ఇవి ఫైబర్, ఇతర రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. శరీరంలోని కార్బోహైడ్రేట్లు, చక్కెరను గ్రహించడంలో సహాయపడతాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర సాధారణంగా ఉంటుంది.

ఆకు కూరలు: ఈ కూరగాయలలో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్‌ ఎ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి.

జొన్నలు, రాగులు: జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలలో డయాబెటిస్‌ను నియంత్రించే కారకాలు ఉంటాయి. రాగి జావ, జొన్న రవ్వతో చేసిన ఉప్మా, జొన్న రొట్టెలు, రాగి జావ, రాగి రొట్టెలు తీసుకోవడం డయాబెటిక్స్‌కు చాలా మంచిది.

Advertisement

What’s your opinion

Advertisement