Sakshi News home page

బోరిస్‌ కావాలనే తప్పుదోవ పట్టించారు

Published Fri, Jun 16 2023 6:04 AM

Former UK PM Boris Johnson deliberately misled parliament - Sakshi

లండన్‌: బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ పార్లమెంట్‌ను ఉద్దేశపూర్వకంగా పదేపదే తప్పుదోవ పట్టించారని పార్లమెంటరీ కమిటీ ఆరోపించింది. ప్రధానిగా ఉండగా కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ డౌనింగ్‌ స్ట్రీట్‌లోని అధికార నివాసంలో జరిగిన విందుల గురించి తనకు తెలియదనడంపై ఈ వ్యాఖ్యలు చేసింది. కోవిడ్‌ సమయంలో జరిగిన విందులనే పార్టీ గేట్‌ కుంభకోణంగా పేర్కొంటున్నారు. ‘సభను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించిన జాన్సన్‌ తీవ్రమైన ధిక్కారానికి పాల్పడ్డారని భావిస్తున్నాం.

ఈ ధిక్కారం మరింత తీవ్రమైంది’అని పార్లమెంట్‌ హక్కుల కమిటీ పేర్కొంది. పార్లమెంటరీ కమిటీ సభ్యులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ జాన్సన్‌ ఇటీవల ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో జాన్సన్‌ చేసిన వ్యాఖ్యలపైనా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు  ఆయన్ను 90 రోజుల పాటు బహిష్కరించాలని సూచించింది. రాజీనామా చేసినందున..మాజీ సభ్యులకిచ్చే పాస్‌ను జాన్సన్‌కు ఇవ్వొద్దని పేర్కొంది. 

Advertisement

What’s your opinion

Advertisement