Sakshi News home page

Fishermen Eat Dolphin In UP: మత్స్యకారుల చేతికి డాల్ఫిన్‌.. ఇంటికెళ్లి కూర వండేసుకున్నాక..

Published Tue, Jul 25 2023 12:30 PM

fishermen eat dolphin catching it from yamuna - Sakshi

మనదేశంలోని యమునా నది ప్రస్తుతం ఉప్పొంగి ప్రవహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో యుమునలో రకరకాల చేపలు తేలియాడుతూ కనిపిస్తున్నాయి. గతంలో ఇన్ని చేపలు కనిపించేవి కాదని యమున పరీవాహక ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. కాగా యమునా నదిలో ఇటీవలి కాలంలో డాల్ఫిన్లు కూడా కనిపిస్తున్నాయి.

యూపీలోని కౌశంబి జిల్లాలో పిపరీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉంటున్న నలుగురు మత్స్యకారులు యమునలోని డాల్ఫిన్లను పట్టుకుని, కూర చేసుకుని తినేశారనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపధ్యంలో పోలీసులు నలుగురు మత్స్యకారులపై కేసు నమోదు చేశారు. 

పిపరీ పోలీసు అధికారి శ్రవణ్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్ర కుమార్‌ నసీర్‌పూర్‌ గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులపై ఫిర్యాదు చేశారన్నారు. ఆ మత్స్యకారుల తమ వలలో పడిన డాల్ఫిన్‌ను ఇంటికి తీసుకుపోయి, కూర వండుకున్నారని రవీంద్రకుమార్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. 

ఈ ఉదంతం గురించి పోలీసులు మాట్లాడుతూ ఆ మత్స్యకారులు డాల్ఫిన్‌ను తీసుకెళ్లడాన్ని ఎవరో వీడియో తీసి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారన్నారు. దీనిపై విచారణ జరిపి, నలుగురు మత్స్యకారులపై కేసు నమోదు చేశామన్నారు.  వీరిలో రాజేష్‌ కుమార్‌ అనే నిందితుడిని అరెస్టు చేశామని, మిగిలినవారు పరారయ్యారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. 
ఇది కూడా  చదవండి: అణుబాంబు ఆవిష్కర్తకు భారత పౌరసత్వం.. నెహ్రూ ఆఫర్‌ను తిరస్కరించిన ఓపెన్‌హైమర్!

Advertisement

What’s your opinion

Advertisement