Sakshi News home page

Health Benefits Of Kismiss: నానబెట్టిన కిస్‌మిస్‌లు తరచూ తింటున్నారా... ఆ సమస్యలు ఉంటే!

Published Fri, Feb 11 2022 5:55 PM

Amazing 8 Health Benefits Of Dry Grapes Raisins In Telugu - Sakshi

ద్రాక్ష.. వేల సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా సాగు అవుతోంది. నీరు అత్యధికంగా కలిగి ఉండే ద్రాక్ష పళ్లను వైన్‌ తయారీలో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే ద్రాక్షలో 60 శాతం వైన్‌ తయారీకే వినియోగిస్తారు తెలుసా! ఇక ద్రాక్షను ఎండబెడితే తయారయ్యేదే ఎండు ద్రాక్ష. దీనినే కిస్మిస్‌ అని కూడా పిలుస్తారు. మరి మీకు కిస్మిస్‌లు తినే అలవాటుందా? అయితే, ఇది మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

ఎండు ద్రాక్షలో లభించే పోషకాలు:
ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
అదే విధంగా పిండి పదార్ధాలు కూడా పుష్కలం.
యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
విటమిన్‌ ఏ, బీ, సి విటమిన్‌ కూడా ఎండు ద్రాక్షలో ఉంటుంది.
ఎండు ద్రాక్షలో లభించే ఖనిజ లవణాలు.. కాపర్‌, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌, ఫాస్పరస్‌, మాంగనీస్‌. 

ఎండు ద్రాక్ష తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: 
బరువు తగ్గడం, లైంగికపరమైన కోరికలు తగ్గడం లాంటి సమస్యలున్న వారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
సంతానలేమితో బాధపడుతున్న వారు ఎండు ద్రాక్ష తింటే ఉపయోగకరమని పలు పరిశోధనల్లో ఈ విషయం నిరూపితమైంది. 
జ్వరంతో బాధపడేవారికి కిస్మిస్‌ దివ్య ఔషధం. 
చిన్నపిల్లల్లో జీర్ణశక్తి బాగా పెరిగేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. 
ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు బాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.
విటమిన్‌ బి ఆహారాన్ని విఛ్చిన్నం చేసి శరీరానికి పోషకాలు గ్రహించడంలో తోడ్పడుతుంది.
కాపర్‌ మెలనిన్‌ ఉత్పత్తిలో కీలకం. కేశాలు నల్లగా మెరవాలంటే కాపర్‌ కలిగి ఉండే ఎండు ద్రాక్ష తింటే సరి. 
ఇందులోని ఐరన్‌ రక్తహీనతను తగ్గిస్తుంది. బీటా కెరోటిన్‌ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నానబెట్టిన కిస్‌మిస్‌లను తింటే బాడీ మెటబాలిజం  సమతుల్యం అవుతుంది. జీవక్రియలు చురుగ్గా ఉంటాయి.

చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే..

Advertisement

What’s your opinion

Advertisement